Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేతన్ హత్య కేసు: చంపాక ఎలా ఏడవాలి?.. చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు!

Ketan Agarwal murder case fiancee asked ChatGPT how to cry after killing him
Advertisement
  • కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రియురాలు సియా గోయల్ సహా ముగ్గురిపై చార్జిషీట్
  • హత్యకు, ఆ తర్వాత ఎలా ప్రవర్తించాలో తెలుసుకునేందుకు చాట్‌జీపీటీ వాడిన సియా
  • లోహగడ్ కోటలో ప్రియుడిని కొండపైనుంచి తోసి హత్య చేసినట్లు ఆరోపణ
  • నెల రోజుల ముందే హత్య ప్రదేశంలో రెక్కీ నిర్వహించినట్లు వెల్లడి
  • ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం... విచారణలో వీడిన హత్య మిస్టరీ
Advertisement
ప్రేమించి, నిశ్చితార్థం చేసుకున్న యువకుడినే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుణేలోని లోహగడ్ కోట వద్ద కేతన్ అగర్వాల్ మరణం కేసులో పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల చార్జిషీట్... ప్రేమ ముసుగులో జరిగిన ఘోరమైన కుట్రను, టెక్నాలజీని నేరానికి ఎలా వాడుకున్నారో కళ్లకు కట్టింది. ఈ హత్య కేసులో కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితులు చేతన్ చౌదరి, రితేష్ హంగేలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.

నెల ముందే రెక్కీ... పక్కా ప్లాన్‌తో హత్య
చార్జిషీట్ ప్రకారం, సియా గోయల్ ఈ హత్యకు ప్రధాన సూత్రధారి. హత్యకు నెల రోజుల ముందు, అంటే మే 31న, సియా తన ప్రియుడు కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. సరిగ్గా అతడిని ఎక్కడైతే లోయలోకి తోసి చంపాలనుకుందో, అదే ప్రదేశంలో వెనుక నుంచి వివిధ యాంగిల్స్‌లో ఫోటోలు తీసింది. ఇది పక్కా ప్రణాళికలో భాగమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం జూన్ 18న, ఓ ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కేతన్‌ను ఆకర్షించి, మరోసారి లోహగడ్ కోటకు రప్పించారు. అక్కడ, ముందుగా సియా గోయల్ కేతన్‌ను బలంగా నెట్టగా, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి బలంగా తన్ని లోయలోకి పడేశాడని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

నేరానికి టెక్నాలజీ... చాట్‌జీపీటీ సాయం
ఈ కేసులో డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి. హత్యకు ముందే సియా.. కేతన్ తల్లికి క్షమాపణ చెబుతూ ఓ సందేశాన్ని రాయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనమైన చాట్‌జీపీటీ సాయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతటితో ఆగకుండా, హత్య తర్వాత దుఃఖాన్ని ఎలా నటించాలి? ఒకవేళ పోలీసులు పట్టుకుంటే ఎలా తప్పించుకోవాలి? విచారణను ఎలా ఎదుర్కోవాలి వంటి ప్రశ్నలను కూడా చాట్‌జీపీటీలో వెతికినట్లు ఆధారాలు లభించాయి. క్రైమ్, మర్డర్ మిస్టరీ సినిమాలు చూడటం, పాడ్‌కాస్ట్‌లు వినడం కూడా ఈ కుట్రలో భాగమేనని పోలీసులు తమ నివేదికలో తెలిపారు.

కేతన్ మరణం తొలుత ప్రమాదవశాత్తు జరిగిందని అందరూ భావించారు. అయితే, కుటుంబ సభ్యుల అనుమానాలు, పోలీసుల లోతైన విచారణతో ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అనే కోణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ 5,053 పేజీల చార్జిషీట్ కేసు విచారణలో కీలక ఆధారం కానుంది.
Advertisement
Advertisement
Ketan Agarwal
Siya Goyal
Pune Lohagad Fort murder
ChatGPT murder case
Siya Goyal murder conspiracy
Ketan Agarwal murder chargesheet

More Telugu News